+91 99635 77856

వల్బాపూర్ గ్రామంలో అగ్నిప్రమాద బాధితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్థిక సహాయం…

ఎల్కతుర్తి/నవంబర్ 26 (మా అక్షరం)

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బాధితులకు తక్షణ సహాయంగా ₹25,000లను ఇంద్రసేనారెడ్డి, సంతాజి చేతుల మీదుగా అందజేత…

“అండగా ఉంటాం” – మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఫోన్‌లో హామీ…

మండలంలోని వల్బాపూర్ గ్రామంలో మంగళవారం రోజున జరిగిన అగ్నిప్రమాదంలో చిర్ర రాజయ్య గౌడ్ ఇల్లు మొత్తం దగ్ధమై పెద్ద నష్టం సంభవించింది. కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిన నేపథ్యంలో రవాణా శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, పిఎసి చైర్మన్ సంతాజి బుధవారం గ్రామాన్ని సందర్శించి రాజయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధితుడికి తక్షణ సహాయంగా మంత్రి సూచనతో 25 వేల రూపాయలను అందజేశారు. తదుపరి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రాజయ్య గౌడ్‌కు ఫోన్ చేసి మాట్లాడి, “మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం, అవసరమైన సహాయం అందిస్తాం” అని హామీ ఇచ్చారు. రఘు, శేఖర్ గ్రామశాఖ అధ్యక్షులు కట్కూరి గౌతమ్, మాజీ సర్పంచ్ పొనగంటి రత్నాకర్ రావు, కిష్టారావు, ఐలయ్య, చిత్తరంజన్, మాజీ ఉపసర్పంచ్ బుచ్చల రాజేష్, పెండ్యాల మహేందర్ , పెండ్యాల యాదగిరి, స్వామి రావు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !