+91 99635 77856

అయోధ్యకు వెళుతున్న కరీంనగర్ బిజెపి శ్రేణులకు వీడ్కోలు పలికిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

అయోధ్యకు వెళుతున్న కరీంనగర్ బిజెపి శ్రేణులకు వీడ్కోలు పలికిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

హుజురాబాద్ :అయోధ్యలో కొలువుదీరిన శ్రీ రాముడి దర్శనం కోసం కరీంనగర్ జిల్లా బిజెపి శ్రేణులు గురువారం సాయంత్రం ప్రత్యేక రైలులో తరలి వెళ్లారు. ఇటీవలే అయోధ్య రామ మందిరం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు , కార్యకర్తల కోసం అయోధ్య రాముడి దర్శనం, ప్రయాణం, వసతి కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక రైల్లో బిజెపి శ్రేణులు గురువారం సాయంత్రం అయోధ్యకు బయలుదేరిన నేపథ్యంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు కాజీపేట రైల్వేస్టేషన్లో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల చిరకాల స్వప్నం, 500 ఏళ్ల కల అయోధ్య రామ మందిరం అన్నారు. దశాబ్దాల పోరాట ఫలితంగా నేడు అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడం సంతోషకరమన్నారు. జిల్లా బిజెపి శ్రేణులు అయోధ్య రాముడి దర్శనానికి తరలి వెళ్లడం ఆనందకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి గారు. స్టేట్ కౌన్సిల్ నెంబర్ పుప్పాల రఘు. వరంగల్ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కవిత గీత. సంతోష్, పట్టణ అధ్యక్షులు గంగిషెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి వోడ్నాల విజయ్, అంకతి వాసు, శశిధర్ , తుర్పటి రాజు, ప్రభాకర్, కొలిపాక శ్రీనివాస్, సుధాకర్ రావు,మండల నాయకులు, తదితర నాయకులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !