+91 99635 77856

మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్

Kudikala Sai Editor
maaksharamnews.in

మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్

వరంగల్/ జూలై 25 (మా అక్షరం): నరాలు, మెదడు, వెన్నుపూస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి నిపుణుల వైద్య సేవలు అందించేందుకు వరంగల్ కొత్తపేటలోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక న్యూరో క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల ఆధ్వర్యంలో జరిగే ఈ క్యాంప్‌లో రోగులను ప్రత్యక్షంగా పరీక్షించి, వ్యాధి తీవ్రతను అంచనా వేసి అవసరమైన చికిత్సపై సూచనలు అందించనున్నారు. నిరంతర తలనొప్పి, మెదడు సంబంధిత వ్యాధులు, పక్షవాతం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మెడ నొప్పి, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు, నరాల బలహీనత, వెన్నుపూస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైద్యులు సూచించారు.క్యాంప్ సందర్భంగా న్యూరో ప్రొఫైల్ రక్త పరీక్షలను రూ.1,000కే నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సీటీ స్కాన్, ఎన్‌సీఎస్, ఈఈజీ తదితర నిర్ధారణ పరీక్షలను ప్రత్యేక రాయితీతో రూ.1,000కే అందించనున్నట్లు పేర్కొన్నారు. వెన్నుపూస శస్త్రచికిత్సలపై 20 శాతం వరకు తగ్గింపు కల్పించనున్నట్లు వెల్లడించారు.ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు: 94598 75555.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !