+91 99635 77856

రెండో విడత దళిత బందు వెంటనే విడుదల చేయాలి

 

కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్లో ప్రవేశపెట్టిన దళిత బంధు రెండో విడత వెంటనే అమలు చేయాలని లేదంటే బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ తో పాటు మంత్రుల ముట్టడిస్తామని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు బాసాల రామస్వామి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం లో మిగిలి ఉన్న నాలుగు వేల కుటుంబాలకు వెంటనే రెండో విడత దళిత బంధు అమలు చేయాలని అన్నారు. దళిత బంధు అకౌంట్ లను ఫ్రీజ్ చేశారని వెంటనే ఫ్రీజింగ్ ఎత్తివేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోసం రెండో విడత ఆపరని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. రెండో విడత దళితబంధు వస్తదని చాలామంది దళితులు అప్పులు చేసి మరి తమ వ్యాపారాన్ని పెంచుకున్నారని అన్నారు. దళిత బంధు రెండో విడత రాకపోవడంతో ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడుతున్నారని అన్నారు. దళితులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దళిత బంధు రెండో విడత వచ్చేవరకు పోరాటాన్ని ఆపేది లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిఎస్పి జిల్లా అధ్యక్షుడు మేకల రవీందర్, హుజురాబాద్ మండల అధ్యక్షులు గిన్నారపు మహేందర్. కొంగల కుమార్ యాదవ్, మంద సమ్మయ్య, దొడ్డే శ్రీనివాస్ నియోజకవర్గ ఇంఛార్జి, పంజాల దిలిప్ గౌడ్, పుల్లలా నరేష్, మాటురీ అజయ్ గౌడ్, రామ్ శ్రీనివాస్, మూగల శేఖర్, మొలుగూరి శ్రీనివాస్, అజయ్ కుమార్, రెనుకుంట్ల రంజిత్, మునిగాలా రాజ్, బీఎస్పీ సీనియర్ నాయకులు వేల్పుల మల్లేష్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !