వరంగల్/ జూలై 11 (మా అక్షరం): మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జూలై 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు ఉచిత ప్రత్యేక మహిళా గైనకాలజీ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.ఈ శిబిరంలో ప్రసూతి, స్త్రీ వ్యాధుల నిపుణురాలు డా. రమ్య దాస్యం (ఎంబీబీఎస్, డీజీవో, ఫెలో ఇన్ ఇన్‌ఫెర్టిలిటీ, ఫెలో ఇన్ డయాగ్నస్టిక్ అండ్ ఆపరేటివ్ హిస్టెరోస్కోపీ) మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించనున్నారు.శిబిరంలో పీసీఓడీ, నెలసరి సమస్యలు, సంతానలేమి, వైట్ డిశ్చార్జ్, ఫైబ్రాయిడ్స్, గర్భాశయ సంబంధిత వ్యాధులు, మెనోపాజ్ సమస్యలపై నిపుణుల సలహాలు అందించనున్నారు. అలాగే హాజరయ్యే మహిళలకు హిమోగ్లోబిన్, రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు, అవసరమైతే వైద్యుల సూచన మేరకు అల్ట్రాసౌండ్ పెల్విస్ స్కాన్ కూడా ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.శిబిరం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వరంగల్ కొత్తపేట క్రాస్‌రోడ్‌లోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో జరుగుతుందని పేర్కొన్నారు.మహిళలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. శిబిరంలో పాల్గొనదలిచిన వారు ముందస్తు నమోదు కోసం 9459875555 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.












