+91 99635 77856

జిల్లా స్థాయి స్మారక కబడ్డీ పోటీలు ప్రారంభం

Kudikala Sai Editor
maaksharamnews.in

జిల్లా స్థాయి స్మారక కబడ్డీ పోటీలు ప్రారంభం

హుజురాబాద్/ జూలై 11 (మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి పి. సమ్మయ్య (రణధీర్), జి. మల్లయ్య, జి. మూర్తి, జి. బాలరాజు స్మారక కబడ్డీ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సుమారు 40 జట్లు పాల్గొంటున్నాయి.పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి దోహదపడతాయని అన్నారు. గెలుపు–ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జి. సమ్మిరెడ్డి, ఎస్. సారయ్య, వైస్ చైర్‌పర్సన్ గూడూరు అంజలి, ఎంఈఓ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా–హుజురాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవీందర్, కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజయ్య, మాడ్రన్ కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రవెల్లి సంపత్‌రావు, పీడీలు వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, రవికుమార్, శ్రీనివాస్, రేణుక, భాగ్యలక్ష్మి, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఆరె తిరుపతి, మహేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !