ఇల్లందకుంట/జూలై 10 (మా అక్షరం): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇల్లందకుంట మండలంలోని కనగర్తి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ… విద్యే సమాజ అభివృద్ధికి పునాదని, విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల శ్రీనివాసరెడ్డి, బచ్చల భానుచందర్, అరవింద్ రెడ్డి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.













