+91 99635 77856

అక్రమంగా తరలిస్తున్న 101 పీడీఎస్ బియ్యం బస్తాలు స్వాధీనం

Kudikala Sai Editor
maaksharamnews.in

అక్రమంగా తరలిస్తున్న 101 పీడీఎస్ బియ్యం బస్తాలు స్వాధీనం

హుజురాబాద్/ జూలై 10 (మా అక్షరం): హుజురాబాద్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యాన్ని టీఎస్‌ఎఫ్ బృందం, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా TS02UD4875 నంబరు గల మహీంద్రా బొలెరో వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 101 పీడీఎస్ రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని హుజురాబాద్ పట్టణంలోని కొత్తపల్లి, ఇందిరానగర్ కాలనీకి చెందిన నార్ల రవీందర్ (60) ప్రజల నుంచి పీడీఎస్ రేషన్ బియ్యాన్ని సేకరించి, వాహనంలో లోడ్ చేసి హుజురాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కోళ్ల ఫారమ్‌లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం మొత్తం 48.60 క్వింటాళ్లు ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !