+91 99635 77856

సర్ పై క్షేత్రస్థాయిలో పరిశీలించండి

Kudikala Sai Editor
maaksharamnews.in

సర్ పై క్షేత్రస్థాయిలో పరిశీలించండి

- నియోజకవర్గ స్థాయి కో-ఆర్డినేటర్లతో ముఖ్య సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్...

హుజురాబాద్, జూలై 17 (మా అక్షరం): హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన ముఖ్య సమావేశంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూత్‌లో ఓటర్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి ఓటు విలువైనదే కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియను రాష్ట్ర పీసీసీ నిశితంగా పరిశీలిస్తోందని, ఎన్నికల కమిషన్ పొడిగించిన గడువును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కో-ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు.గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి నియోజకవర్గ ఇంచార్జిలకు, బీఎల్‌ఓలకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త, బీఎల్‌ఏ, కో-ఆర్డినేటర్ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని   అన్ని మండలాల, పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– నియోజకవర్గ స్థాయి కో-ఆర్డినేటర్లతో ముఖ్య సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్…

హుజురాబాద్, జూలై 17 (మా అక్షరం): హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన ముఖ్య సమావేశంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూత్‌లో ఓటర్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి ఓటు విలువైనదే కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియను రాష్ట్ర పీసీసీ నిశితంగా పరిశీలిస్తోందని, ఎన్నికల కమిషన్ పొడిగించిన గడువును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కో-ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు.గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి నియోజకవర్గ ఇంచార్జిలకు, బీఎల్‌ఓలకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త, బీఎల్‌ఏ, కో-ఆర్డినేటర్ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని   అన్ని మండలాల, పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !