+91 99635 77856

ఈశ్వరమ్మ యాదవ్‌ను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

ఈశ్వరమ్మ యాదవ్‌ను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి

-ఈశ్వరమ్మ యాదవ్‌ను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి....

-హుజురాబాద్‌లో బీసీ జేఏసీ ధర్నా...

హుజురాబాద్/ జూలై 17 (మా అక్షరం): యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌ను కులపరంగా దూషించిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలు గడిచినా బీసీలపై వివక్ష, అణచివేత ఘటనలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యురాలిగా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో పేరు లేకపోవడాన్ని కారణంగా చూపుతూ శివచరణ్ రెడ్డి దుర్భాషలాడడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కులపరంగా దూషించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.బీసీలు ఐక్యంగా ముందుకు వచ్చినప్పుడే తమ హక్కులను సాధించగలరని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పార్టీలకు అతీతంగా ఐక్యంగా నిలిచి రాజ్యాధికార సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ధర్నాలో ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, మావునూరి ప్రవీణ్‌కుమార్, దేవసాని ప్రియదర్శిని, కొలిపాక క్రాంతి, స్వేరో నాయకులు అక్కినేపల్లి ప్రవీణ్‌కుమార్, ప్రజా సంఘాల నాయకులు రామ్ సారయ్య, గడప రాజు, మేకల రవి, దొంత హరికిషన్, సొల్లు శంకర్, ఊదారపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-ఈశ్వరమ్మ యాదవ్‌ను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి….

-హుజురాబాద్‌లో బీసీ జేఏసీ ధర్నా…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !