+91 99635 77856

నీట్ విద్యార్థుల అమరులకు కొవ్వొత్తుల ర్యాలీ

Kudikala Sai Editor
maaksharamnews.in

నీట్ విద్యార్థుల అమరులకు కొవ్వొత్తుల ర్యాలీ

హుజురాబాద్/ జూలై 25 (మా అక్షరం): కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థుల ఉద్యమం, దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. నీట్ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు నివాళులర్పిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... విద్యార్థులు, యువత త్యాగాలు దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని, అమరుల ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అమరులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ జూలై 25 (మా అక్షరం): కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థుల ఉద్యమం, దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. నీట్ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు నివాళులర్పిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యార్థులు, యువత త్యాగాలు దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని, అమరుల ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అమరులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !