వరంగల్/ జూలై 18 (మా అక్షరం):వరంగల్‌లోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జూలై 21, 22, 23 తేదీలలో ఉచిత జనరల్ మెడిసిన్ మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రముఖ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డా. ఎన్. రాజి రెడ్డి (ఎంబీబీఎస్, డీఎన్‌బీ) సేవలతో ఈ శిబిరం నిర్వహించనున్నారు.శిబిరంలో మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ వ్యాధులు, వైరల్ జ్వరాలు తదితర సాధారణ ఆరోగ్య సమస్యలకు నిపుణుల వైద్య పరీక్షలు, సలహాలు, అవసరమైన చికిత్స అందించనున్నారు. సీబీపీ, రక్తంలో చక్కెర (ఆర్‌బీఎస్/హెచ్‌బీఎస్), సీరమ్ క్రియాటినిన్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనుండగా, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, హెచ్‌బీఏ1సీ పరీక్షలపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు.మధుమేహం, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.శిబిరం జూలై 21 నుంచి 23 వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వరంగల్‌లోని కొత్తపేట క్రాస్‌రోడ్, ఆరెపల్లిలో ఉన్న అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అపాయింట్‌మెంట్, ఇతర వివరాలకు 94598 75555 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.












