– వాకింగ్ ట్రాక్,చిల్డ్రన్ పార్క్ పనుల పరిశీలిన నాణ్యతతో నిర్మించాలని సూచన…
– అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…
-హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్…
హుజురాబాద్/నవంబర్ 27(మా అక్షరం): పట్టణానికి ఆనుకొని ఉన్న మోడల్ చెరువు సుందరీకరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి చిల్డ్రన్ పార్క్,వాకింగ్ ట్రాక్ పనుల్లో నాణ్యత పాటించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధికారులు సూచించారు.గురువారం పట్టణంలోని మోడల్ చెరువు ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విశాల విస్తీర్ణం కలిగిన చెరువు ఇన్ని రోజులు అభివృద్ధికి నోచుకోలేదనీ,గొప్పగా పరిపాలించామని చెప్పిన నాయకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో వారికే తెలువాలి అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హుజురాబాద్ పట్టణానికి సంబంధించి అభివృద్ధి కొరకు 15 కోట్ల నిధులు మంజూరు చేశామని,దాంట్లో భాగంగా పిల్లలకు ఆడుకోవడానికి,ఆహ్లాదానికి నిధులు కేటాయించామని,చెరువుకు రావడానికి ఇబ్బందిగా ఉన్న పిచ్చి మొక్కలు సైతం గత పాలకులు తొలగించే సమయం లేదా అని ప్రశ్నించారు? మోడల్ చెరువుతో పాటు గంగోనికుంట ను కూడా అభివృద్ధి చేస్తామని,హుజురాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు.గత పాలకులకు బురద చల్లే రాజకీయం తప్ప అభివృద్ధి పై ధ్యాస లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కమిషనర్ సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











