+91 99635 77856

మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శం.

– విద్య సమాన హక్కు అని నినదించిన వ్యక్తి…
– ఆయన ఆశయాలు అందరికి స్ఫూర్తిదాయకం…
– హుజురాబాద్ లోనీ ఒక సర్కిల్ కు పూలే పేరు…
– 1కోటి.50లక్షలతో హుజురాబాద్ పట్టణంలోని 4 జంక్షన్ ల అభివృద్ధికి కృషి…

హుజురాబాద్/నవంబర్ 28 (మా అక్షరం): సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహొన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం 136వ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సివిల్ హాస్పిటల్ ముందు గల ప్రధాన చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చదువుతోనే అభివృద్ధి సాధ్యమని,ఆది అందరి హక్కు అని,అక్షరాస్యత అందరికి అందాలని కొట్లాడారని,ఆయన స్ఫూర్తితో హుజురాబాద్ నియోజకవర్గంలోనీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు.ఇటీవల విడుదల అయిన 15 కోట్ల అభివృద్ధి నిధుల్లో భాగంగా హుజురాబాద్ పట్టణంలో కోటి ముప్పై లక్షలతో 4 ప్రధాన చౌరస్తాలను అభివృద్ధి చేస్తున్నామని దాంట్లో ఒకదానికి జ్యోతి రావు పూలే పేరు పెడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో పూలే ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇప్పలపెల్లి చంద్రశేఖర్,పూలే ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి తులసి లక్ష్మణమూర్తి,గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్,సందెల వెంకన్న,బుర్ర కుమార్, ఉపాధ్యక్షులు మార్త రవీందర్,మధు, చిలకమారి శ్రీనివాస్,ఇప్పకాయల సాగర్, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, డైరెక్టర్లు మాచర్ల నరేష్, పూర్ణచందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, కాంగ్రెస్ పట్టణ మహిళా అద్యక్షురాలు యేముల పుష్పలత, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, రామ్ రాజేశ్వర్, శ్రీనివాస్, రాజ్ కుమార్, సొల్లు బాబు, ఎర్ర రవీందర్, బీఆర్ గౌడ్, కేఆర్ బిక్షపతి, మిడిదొడ్డి రాజు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !