+91 99635 77856

రాంపూర్ 3వ వార్డులో రాం సారయ్య దూకుడు

Kudikala Sai Editor
maaksharamnews.in

రాంపూర్ 3వ వార్డులో రాం సారయ్య దూకుడు

హుజురాబాద్/ డిసెంబర్ 12 (మా అక్షరం): రాంపూర్ గ్రామపంచాయతీ మూడవ వార్డు ఎన్నికల్లో బీరువా గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి రాం సారయ్య గట్టి పోటీని విసురుతూ ప్రజల మద్దతును ఆకర్షిస్తున్నారు. బ్యాలెట్‌ పేపరులో ఐదవ నంబర్ వద్ద ఉన్న తన గుర్తు బీరువా గుర్తుకు ఓటు ఇవ్వాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

వార్డు సమగ్రాభివృద్ధి తన లక్ష్యమని సారయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రస్తుతం పూర్తి కాకుండా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, మురుగునీటి పారుదల సమస్యలను శాశ్వతంగా తొలగిస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటి సదుపాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.వార్డులో ఇప్పటివరకు సిసి రోడ్లు లేని ప్రాంతాలను గుర్తించి, వాటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని వెల్లడించారు. బీసీ సామాజిక వర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. రాత్రివేళల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అన్ని వీధుల్లో వీధి దీపాల ఏర్పాటు చేపడతానని హామీ ఇచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !