+91 99635 77856

సిఐ కరుణాకర్ ఘనసన్మానం

​-సిఐ కరుణాకర్‌కు ఘన సన్మానం…
– అంబేడ్కర్ యువజన సంఘం హర్షం..

హుజురాబాద్/ జనవరి 24 (మా అక్షరం):హుజురాబాద్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) కరుణాకర్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన ‘పోలీసు ప్రతిభా పురస్కారాన్ని’ అందుకోవడం పట్ల పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు సిఐని కలిసి ఘనంగా సత్కరించారు.
​​తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు మాడుగుల ఓదెలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐ కరుణాకర్‌కు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మాడుగుల ఓదెలు మాట్లాడుతూ.. సిఐ కరుణాకర్ తన విధి నిర్వహణలో ప్రదర్శిస్తున్న అంకితభావం, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం హుజురాబాద్ పట్టణానికి గర్వకారణమని కొనియాడారు.
​​పురస్కారం అందుకున్న సిఐని సత్కరించడం ద్వారా తమ సంఘం గర్విస్తోందని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం ప్రతినిధులుతొగరు బిక్షపతి,​సంజీవ్,​మొలుగూరి ప్రభాకర్,శ్రీనివాస్, సభ్యులు పాల్గొని సిఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !