+91 99635 77856

సొంత గూటికి మాజీ కౌన్సిలర్ భీమగోని సురేష్

-సొంత గూటికి మాజీ కౌన్సిలర్ భీమగోని సురేష్…

– బిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం…

హుజురాబాద్/ జనవరి 10 (మా అక్షరం): నియోజకవర్గంలోని హుజురాబాద్ మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్, భీమగోని సురేష్ శనివారం తన సొంత పార్టీ అయినా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకుని బిఆర్ఎస్‌లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల మొత్తాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలుకావడం లేదని విమర్శించారు. గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, హామీలను విస్మరించిందని ఆరోపించారు. రైతులు, పేదలు, మహిళలు, యువత—అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు.తెలంగాణ రైతులకు కనీసం యూరియా సరఫరా చేయలేని స్థితికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చాయని, రెండు ప్రభుత్వలతో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదని స్పష్టం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందేనని, అదే విధంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భీమగోని సురేష్ మాట్లాడుతూ,బిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని నమ్మి పార్టీలో చేరామని తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతుల మన్ననలు పొందుతున్నారని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడితోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమని విశ్వసించి పార్టీ కండువా కప్పుకున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !