+91 99635 77856

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

-శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు…
హుజురాబాద్ /జనవరి 10 (మా అక్షరం):పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలను మామిడి తోరణాలు, అరటి ఆకులతో అందంగా అలంకరించారు. రంగురంగుల సంక్రాంతి ముగ్గులు వేసి కళాశాల ఆవరణను పండుగ వాతావరణంతో నింపారు. భోగి మంటలు వేసి విద్యార్థులు నృత్యాలతో ఉత్సాహంగా సంబరాలు జరిపారు.అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత, పండుగను జరుపుకునే సంప్రదాయ విధానాలను వివరించారు. అలాగే కళాశాల అడ్వైజర్ పోరెడ్డి శాంతన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని, తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలని సూచించారు.ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శాంతన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి, అధ్యాపకులు కొలిపాక రమేష్, భద్రయ్య, సంపత్, శ్రీనివాస్, వెంకటేష్, నవీన్, రమేష్, స్వప్న, ప్రియాంకతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !