+91 99635 77856

ప్రతాపవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రతాపవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు

-ప్రతాపవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు...
హుజురాబాద్/జనవరి10 (మా అక్షరం): భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రతాపవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సోమనాథ మందిరంపై గజినీ మహమ్మద్ చేసిన దండయాత్రకు వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. విశ్వాసం, నాగరికతకు ప్రతీకగా నిలిచిన సోమనాథ మందిరంపై జరిగిన ఆ దాడి భారతీయ చరిత్రలో ఒక హృదయవిదారక ఘట్టమని పేర్కొన్నారు.వెయ్యేళ్లుగా సహనానికి, పునరుజ్జీవనానికి చిహ్నంగా సోమనాథ మందిరం నిలిచిందని, అదే స్ఫూర్తితో సోమనాథ స్వాభిమాన పర్వాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. జనవరి ఎనిమిది, తొమ్మిది, పది తేదీల్లో కొనసాగిన దండయాత్రను స్మరించుకుంటూ సోమనాథ సమగ్రతకు నిరాజనం అర్పిస్తూ శివాలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు.ఎంతోమంది ఈ దేశంపై దురాగతాలకు పాల్పడ్డప్పటికీ భారతదేశం చెక్కుచెదరకుండా నిలబడి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, సబ్బని రమేష్, యాళ్ల సంజీవరెడ్డి, బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్, మధుర రమేష్, రాపాక రాజు, తాళ్లపల్లి దేవేంద్ర, సబ్బని మాధవి, రాజేష్ కన్నా, గుళ్ల అనిల్, కోయల్కర్ నాగసమన్, బండి సాయి, పార్థం అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-ప్రతాపవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !