+91 99635 77856

మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Kudikala Sai Editor
maaksharamnews.in

మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

-మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం...
-వివిధ వార్డుల్లో నామినేషన్లు దాఖలు...
హుజురాబాద్ / జనవరి 28 (మా అక్షరం):పురపాలక సంఘ పరిధిలోని మొత్తం 30 వార్డులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ తెలిపారు.ఈరోజు మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా వార్డు నెంబర్లు 6, 7, 13, 14, 18, 22, 24, 26, 27, 29 ,30ల నుంచి ఒక్కొక్క నామినేషన్ చొప్పున దాఖలైనట్లు తెలిపారు. అలాగే వార్డు 9 వార్డు 15ల నుంచి రెండు నామినేషన్లు చొప్పున స్వీకరించినట్లు వివరించారు.ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని, అభ్యర్థులు అవసరమైన పత్రాలతో నిర్ణీత తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

-మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం…
-వివిధ వార్డుల్లో నామినేషన్లు దాఖలు…
హుజురాబాద్ / జనవరి 28 (మా అక్షరం):పురపాలక సంఘ పరిధిలోని మొత్తం 30 వార్డులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ తెలిపారు.ఈరోజు మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా వార్డు నెంబర్లు 6, 7, 13, 14, 18, 22, 24, 26, 27, 29 ,30ల నుంచి ఒక్కొక్క నామినేషన్ చొప్పున దాఖలైనట్లు తెలిపారు. అలాగే వార్డు 9 వార్డు 15ల నుంచి రెండు నామినేషన్లు చొప్పున స్వీకరించినట్లు వివరించారు.ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని, అభ్యర్థులు అవసరమైన పత్రాలతో నిర్ణీత తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !