+91 99635 77856

హుజూరాబాద్‌లో నామినేషన్ల దాఖలుకు జోరు

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజూరాబాద్‌లో నామినేషన్ల దాఖలుకు జోరు

-హుజూరాబాద్‌లో నామినేషన్ల దాఖలుకు జోరు...
-రెండో రోజున 78… రెండు రోజుల్లో 93 నామినేషన్లు స్వీకరణ....
హుజూరాబాద్/ జనవరి 29 (మా అక్షరం): హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండో రోజున 78 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు.ఇప్పటివరకు రెండు రోజుల వ్యవధిలో పట్టణ పరిధిలోని మొత్తం 30 వార్డుల నుంచి 93 నామినేషన్లు అందాయని ఆయన వెల్లడించారు.పార్టీల వారీగా నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే బీజేపీ నుంచి 23, కాంగ్రెస్ నుంచి 29, బీఆర్ఎస్ నుంచి 27, బీఎస్పీ నుంచి ఒకటి, ఇతర పార్టీల నుంచి మూడు, స్వతంత్ర అభ్యర్థులుగా 10 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.నామినేషన్ల దాఖలుతో హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Share ePaper Clip

Preparing image...

-హుజూరాబాద్‌లో నామినేషన్ల దాఖలుకు జోరు…
-రెండో రోజున 78… రెండు రోజుల్లో 93 నామినేషన్లు స్వీకరణ….
హుజూరాబాద్/ జనవరి 29 (మా అక్షరం): హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండో రోజున 78 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు.ఇప్పటివరకు రెండు రోజుల వ్యవధిలో పట్టణ పరిధిలోని మొత్తం 30 వార్డుల నుంచి 93 నామినేషన్లు అందాయని ఆయన వెల్లడించారు.పార్టీల వారీగా నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే బీజేపీ నుంచి 23, కాంగ్రెస్ నుంచి 29, బీఆర్ఎస్ నుంచి 27, బీఎస్పీ నుంచి ఒకటి, ఇతర పార్టీల నుంచి మూడు, స్వతంత్ర అభ్యర్థులుగా 10 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.నామినేషన్ల దాఖలుతో హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !