+91 99635 77856

సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లనివ్వని పోలీసులు

Kudikala Sai Editor
maaksharamnews.in

సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లనివ్వని పోలీసులు

-సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లనివ్వని పోలీసులు....
-రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబం...
-పోలీసుల ఓవర్ యాక్షన్‌ – ఎస్పీ సస్పెన్షన్‌కు డిమాండ్...
హుజూరాబాద్/ జనవరి 29( మా అక్షరం):వీణవంక మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లుతున్న పాడి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేసి క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానిక దళిత మహిళా సర్పంచ్ దాసరపు సరోజనతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు జాతరకు వెళ్తుండగా, కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అడ్డుకున్నారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి హుజూరాబాద్–హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.ఈ క్రమంలో పోలీసులు–బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనను పోలీసుల ఓవర్ యాక్షన్‌గా అభివర్ణించిన బీఆర్ఎస్ నేతలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

-సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లనివ్వని పోలీసులు….
-రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబం…
-పోలీసుల ఓవర్ యాక్షన్‌ – ఎస్పీ సస్పెన్షన్‌కు డిమాండ్…
హుజూరాబాద్/ జనవరి 29( మా అక్షరం):వీణవంక మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లుతున్న పాడి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేసి క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానిక దళిత మహిళా సర్పంచ్ దాసరపు సరోజనతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు జాతరకు వెళ్తుండగా, కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అడ్డుకున్నారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి హుజూరాబాద్–హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.ఈ క్రమంలో పోలీసులు–బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనను పోలీసుల ఓవర్ యాక్షన్‌గా అభివర్ణించిన బీఆర్ఎస్ నేతలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !