+91 99635 77856

బిఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక

బిఆర్ఎస్ పార్టీలోకి పలువురి చేరిక…
-22వ వార్డులో బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధీమా…
హుజురాబాద్/ జనవరి 29 (మా అక్షరం):హుజురాబాద్ పట్టణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది. పట్టణంలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు నాయకులు అధికారికంగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 22వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా తలకొక్కుల శ్యామల- హరిప్రసాద్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డులో బిఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని, ప్రతి వార్డులోనూ పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జి ప్యానాల భూపతి రెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొల్లిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, సీనియర్ నాయకులు పోరెడ్డి శాంతన్ రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, చంద గాంధీ, వర్ధనేని రవీందర్ రావు, బొల్లు శ్రీనివాస్, ఆడెపు అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !