-లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.…
-హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజూరాబాద్/ జూన్ 06 మా అక్షరం: నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.కాట్రపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, జూపాక, చెల్పూర్, రంగాపూర్, పోతిరెడ్డిపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని పేర్కొన్నారు.ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బండ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.













