+91 99635 77856

గుండ్ల చెరువు మత్తడి తగ్గించాలి: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి

Kudikala Sai Editor
maaksharamnews.in

గుండ్ల చెరువు మత్తడి తగ్గించాలి: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి

హుజురాబాద్/ జూన్ 10 (మా అక్షరం): గుండ్ల చెరువు మత్తడి ఎత్తుగా ఉండటంతో ప్రతి వర్షాకాలంలో పట్టణంలోని పలు కాలనీలు, వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని పేర్కొంటూ మత్తడిని తగ్గించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బాధిత రైతులు, స్థానిక ప్రజలు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు.మత్తడి ఎత్తు కారణంగా పోచమ్మవాడతో పాటు పలు కాలనీలు జలమయం అవుతున్నాయని, వందల ఎకరాల పంట భూములు నీట మునిగి రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుని మత్తడిని తగ్గించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !