+91 99635 77856

సీబీఎఫ్‌సీ సభ్యుడిగా సబ్బని రమేష్ నియామకం

Kudikala Sai Editor
maaksharamnews.in

సీబీఎఫ్‌సీ సభ్యుడిగా సబ్బని రమేష్ నియామకం

హుజురాబాద్ / జూన్ 11 (మా అక్షరం): బీజేపీ నాయకుడు సబ్బని రమేష్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుడిగా నియమించినట్లు రీజినల్ ఆఫీసర్ డా. రాహుల్ గౌలికర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ నియామక పత్రం అందజేశారు. ఈ నియామకంతో హుజురాబాద్‌కు గౌరవం దక్కిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తున్న రమేష్‌కు కేంద్ర స్థాయిలో అవకాశం లభించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్బని రమేష్ మాట్లాడుతూ... తనపై విశ్వాసం ఉంచి అవకాశం కల్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌తో పాటు పార్టీ జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్ / జూన్ 11 (మా అక్షరం): బీజేపీ నాయకుడు సబ్బని రమేష్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుడిగా నియమించినట్లు రీజినల్ ఆఫీసర్ డా. రాహుల్ గౌలికర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ నియామక పత్రం అందజేశారు. ఈ నియామకంతో హుజురాబాద్‌కు గౌరవం దక్కిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తున్న రమేష్‌కు కేంద్ర స్థాయిలో అవకాశం లభించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్బని రమేష్ మాట్లాడుతూ… తనపై విశ్వాసం ఉంచి అవకాశం కల్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌తో పాటు పార్టీ జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !