+91 99635 77856

రాజపల్లిలో బీఆర్ఎస్‌లో చేరికలు

Kudikala Sai Editor
maaksharamnews.in

రాజపల్లిలో బీఆర్ఎస్‌లో చేరికలు

హుజురాబాద్/ జూన్ 10(మా అక్షరం) మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజపల్లి సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జూపాక సింగిల్ విండో చైర్మన్ అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఉప సర్పంచ్ శనిగరం అయిలయ్య, బీజేపీ బూత్ అధ్యక్షుడు ఈర్ల రాజు, ఈర్ల ప్రవీణ్, మునిగాల పోచయ్య, శనిగరపు సమ్మయ్య, నోముల కరుణాకర్, పత్తి శ్రీనివాస్ రెడ్డి, శనిగరపు రవి, కాంగ్రెస్ బూత్ అధ్యక్షుడు ఎండి రమీజ్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ చెవుల సాయి కుమార్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కొత్త చేరికలతో రాజపల్లి గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ జూన్ 10(మా అక్షరం) మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజపల్లి సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జూపాక సింగిల్ విండో చైర్మన్ అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఉప సర్పంచ్ శనిగరం అయిలయ్య, బీజేపీ బూత్ అధ్యక్షుడు ఈర్ల రాజు, ఈర్ల ప్రవీణ్, మునిగాల పోచయ్య, శనిగరపు సమ్మయ్య, నోముల కరుణాకర్, పత్తి శ్రీనివాస్ రెడ్డి, శనిగరపు రవి, కాంగ్రెస్ బూత్ అధ్యక్షుడు ఎండి రమీజ్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ చెవుల సాయి కుమార్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కొత్త చేరికలతో రాజపల్లి గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !