+91 99635 77856

కార్యకర్తలే పార్టీకి బలం: కౌశిక్ రెడ్డి

Kudikala Sai Editor
maaksharamnews.in

కార్యకర్తలే పార్టీకి బలం: కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ /జూన్ 10(మా అక్షరం):నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, బీఎల్‌ఏల బాధ్యతలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా చేపట్టి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అవగాహన కల్పించాలని, బీఎల్‌ఏలు ఓటరు జాబితాల సవరణలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు.
జూన్ 12న మాజీ మంత్రి ఎమ్మెల్యే టి. హరీష్ రావు రాక...
జూన్ 12న జమ్మికుంట లోని ఎంపీఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు, బీఎల్‌ఏ అవగాహన కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్ /జూన్ 10(మా అక్షరం):నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, బీఎల్‌ఏల బాధ్యతలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా చేపట్టి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అవగాహన కల్పించాలని, బీఎల్‌ఏలు ఓటరు జాబితాల సవరణలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు.
జూన్ 12న మాజీ మంత్రి ఎమ్మెల్యే టి. హరీష్ రావు రాక…
జూన్ 12న జమ్మికుంట లోని ఎంపీఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు, బీఎల్‌ఏ అవగాహన కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !