+91 99635 77856

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ప్రణవ్

Kudikala Sai Editor
maaksharamnews.in

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ప్రణవ్

హుజురాబాద్ /జూన్ 10 (మా అక్షరం): పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణ, మండల వార్డు అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై నాయకులతో చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని, ప్రతి నాయకుడు బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. త్వరలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ శ్రేణులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, పార్టీ అధికార ప్రతినిధులు, పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్ /జూన్ 10 (మా అక్షరం): పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణ, మండల వార్డు అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై నాయకులతో చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని, ప్రతి నాయకుడు బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. త్వరలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ శ్రేణులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, పార్టీ అధికార ప్రతినిధులు, పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !