+91 99635 77856

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలు

హుజూరాబాద్/ జూన్ 06 (మా అక్షరం): పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు పలు వార్డుల్లో నిర్వహించిన వార్డు సభలకు హాజరయ్యారు. 1, 13, 16, 17వ వార్డుల్లో నిర్వహించిన సభల్లో స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
వార్డు ప్రజలు తమ సమస్యలను వార్డు అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలని చైర్‌పర్సన్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, ఏఈ నరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, వార్డు కౌన్సిలర్లు, అంగన్‌వాడీ సూపర్వైజర్ రమ్య, ఐసీడీఎస్ సిబ్బంది సుగుణ, ప్రతిభ, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !