+91 99635 77856

సైదాపూర్‌లో ఏసీబీ దాడులు.. మండల సర్వేయర్ పట్టివేత

Kudikala Sai Editor
maaksharamnews.in

సైదాపూర్‌లో ఏసీబీ దాడులు.. మండల సర్వేయర్ పట్టివేత

సైదాపూర్ /జూన్ 05 (మా అక్షరం): సైదాపూర్ మండల కేంద్రంలోని సోమారం గ్రామ చౌరస్తాలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడుల్లో మండల సర్వేయర్ కుమారస్వామి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఫిర్యాదుదారుడి భూమి సర్వే పూర్తి చేయడానికి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా మొదట రూ.5 వేల మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా, మరో రూ.10 వేల మొత్తాన్ని ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా స్వీకరించినట్లు సమాచారం. మిగిలిన రూ.10 వేల లంచం చెల్లించిన తర్వాతే సర్వే పూర్తి చేస్తానని చెప్పినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి పర్యవేక్షణలో నిర్వహించిన ఉచ్చులో భాగంగా శుక్రవారం మిగిలిన రూ.10 వేల లంచం తీసుకుంటున్న సమయంలో మండల సర్వేయర్ కుమారస్వామిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !