+91 99635 77856

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

Kudikala Sai Editor
maaksharamnews.in

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

-హుజురాబాద్ పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా బక్రీద్ వేడుకలు...

హుజురాబాద్ / మే 28( మా అక్షరం): పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో బక్రీద్ పండుగను గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు,ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థన చేశారు,ముస్లిం మత గురువు బక్రీద్ పండుగ సందర్భంగా పండుగ ప్రాముఖ్యతను,విశిష్టతను వివరించారు,ఖురాన్ లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ప్రతి ముస్లిం పాటించాలన్నారు శాంతియుతంగా జీవించాలని, పేదలకు సాయం చేయాలని ప్రజలందరూ ధనిక పేద తేడా లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు,ప్రార్ధన అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరు అలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా జామే మస్జిద్ ఈద్గా & ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజురాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షామియానా,సౌండ్ సిస్టం ఏర్పాటుచేసి,పరిశుభ్రత చేసినందుకు హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, కమిషనర్ కి మున్సిపల్ పాలకవర్గానికి అదే విధంగా పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన హుజురాబాద్ ఏసిపి మాధవి కి ,సిఐ కరుణాకర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఈద్గాలోని ప్రత్యేక ప్రార్థనలలో మత గురువు ముఫ్తీ షాకీర్ గారు,జామే మసీద్ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు,ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్ పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా బక్రీద్ వేడుకలు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !