+91 99635 77856

​హుజూరాబాద్ కూరపాటి ఆసుపత్రిలో ‘హెర్నియా కార్నివాల్’ పోస్టర్ ఆవిష్కరణ

హుజూరాబాద్ /మే 28 (మా అక్షరం):స్థానిక కూరపాటి హాస్పిటల్‌లో గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ‘హెర్నియా కార్నివాల్’ (హెర్నియా సంబరాలు) పోస్టర్‌ను ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి రమేష్ బృందం ఘనంగా విడుదల చేసింది.ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ నెల 31 (మే 31) నుండి జూన్ 31 వరకు కూరపాటి హాస్పిటల్, హుజూరాబాద్ నందు ప్రత్యేకంగా ‘హెర్నియా కార్నివాల్’ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఉచిత పరీక్షలు – రాయితీపై శస్త్రచికిత్సలు..

కార్నివాల్ జరిగే రోజుల్లో ప్రతిరోజూ హాస్పిటల్‌లో హెర్నియా వ్యాధికి సంబంధించిన ఉచిత నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడతాయని,​రాయితీతో లాపరోస్కోపీ చికిత్సలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ క్యాంపులో పరీక్షలు చేయించుకుని, హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులందరికీ కూరపాటి హాస్పిటల్‌లోనే అధునాతన లాపరోస్కోపీ విధానం ద్వారా ప్రత్యేక రాయితీ ధరలతో శస్త్రచికిత్సలు చేయబడునని ఆయన పేర్కొన్నారు.హెర్నియా సమస్యలతో బాధపడుతున్న ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రమేష్ కోరారు.​నొప్పి వస్తుందనే భయంతో చాలామంది హెర్నియా ఆపరేషన్‌ను వాయిదా వేస్తూ, సమస్య మరింత క్లిష్టంగా మారిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారని ప్రముఖ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో, ప్రజల్లో హెర్నియాపై అవగాహన కల్పించేందుకు, సామాన్యులకు సైతం అత్యాధునిక లాపరోస్కోపీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.​ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ…హెర్నియా సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకోవడం ఎంతో సురక్షితమని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లాపరోస్కోపీ విధానం ద్వారా శస్త్రచికిత్స ఎంతో సులువుగా, తక్కువ నొప్పితో కూడుకుని ఉంటుందని వివరించారు.​హుజూరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ అవగాహన, వైద్య సేవల కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ కార్తీక్ కూరపాటి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని రోగులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !