+91 99635 77856

దసరా–బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Kudikala Sai Editor
maaksharamnews.in

దసరా–బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

-మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి...

-అధికారులతో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...

హుజురాబాద్/అక్టోబర్ 15 (మా అక్షరం): దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.గురువారం హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పండుగ ఏర్పాట్లపై చర్చించారు. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో ఎదురైన ఇబ్బందులు బతుకమ్మ పండుగ సమయంలో పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మహిళలు సౌకర్యవంతంగా బతుకమ్మ ఆడుకునేలా అనువైన వాతావరణం కల్పించాలని, నిమజ్జన ప్రాంతాల్లోనూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలతోపాటు వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లోనూ దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ మేరకు సంబంధిత మండలాల్లో పండుగ ఏర్పాట్లపై ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.పండుగల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారులు తక్షణమే స్పందించేలా అందుబాటులో ఉండాలని, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు.

Share ePaper Clip

Preparing image...

-మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి…

-అధికారులతో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !