-మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి…
హుజురాబాద్/ అక్టోబర్ 14 (మా అక్షరం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. పూలను ప్రకృతికి ప్రతిరూపంగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని, బతుకునిచ్చే పండుగగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.బుధవారం పట్టణంలోని బతుకమ్మ సౌళ్లలో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం చేపడుతున్న ఏర్పాట్లను వొడితల ప్రణవ్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.బతుకమ్మ ఘాట్ల వద్ద పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












