+91 99635 77856

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

-మహనీయుల విగ్రహాల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి...

-ఐలమ్మ జయంతోత్సవ కమిటీ కన్వీనర్ నిమ్మటూరి సాయికృష్ణ డిమాండ్...

హుజురాబాద్/ అక్టోబర్ 13 (మా అక్షరం): తెలంగాణ వీరనారి, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మెదక్ పట్టణ నడిబొడ్డున ధ్వంసం చేసిన దుండగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చాకలి ఐలమ్మ జయంతోత్సవ కమిటీ కన్వీనర్ నిమ్మటూరి సాయికృష్ణ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నాటి భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అలాంటి మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం విగ్రహంపై జరిగిన దాడి మాత్రమే కాదని, తెలంగాణ పోరాట చరిత్రపై, మహిళా ఆత్మగౌరవంపై, బడుగు బలహీన వర్గాల మనోభావాలపై జరిగిన దాడిగా భావించాలని పేర్కొన్నారు.సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన వారి ఆశయాలను చెరిపివేయలేరని, ప్రజల హృదయాల్లో వారికి ఉన్న స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదని తెలిపారు.ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని కోరారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని మహనీయుల విగ్రహాలకు తగిన రక్షణ కల్పించాలని, విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన శిక్షలు విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవ మార్గం నేటి తరానికి ఆదర్శమని, ఆమె ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిమ్మటూరి సాయికృష్ణ పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

-మహనీయుల విగ్రహాల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి…

-ఐలమ్మ జయంతోత్సవ కమిటీ కన్వీనర్ నిమ్మటూరి సాయికృష్ణ డిమాండ్…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !