+91 99635 77856

భూవివాదంలో రైతు ఆత్మహత్య

Kudikala Sai Editor
maaksharamnews.in

భూవివాదంలో రైతు ఆత్మహత్య

-కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని టీఆర్‌పీ డిమాండ్...

హుజూరాబాద్/ అక్టోబర్ 13 (మా అక్షరం):భూవివాదం కారణంగా మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన రైతు కన్నబోయిన ఓదెలు ఆత్మహత్యకు కారణమైన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రామ సర్పంచ్ పత్తి అనిత భర్త పత్తి కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన కన్నబోయిన ఓదెలు 2018లో పత్తి విష్ణువర్ధన్ రెడ్డి (పత్తి కృష్ణారెడ్డి సోదరుడు) నుంచి 1 ఎకరం 4 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా 10.40 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. అయితే కుటుంబ తగాదాలు, న్యాయపరమైన వివాదాల వల్ల ఆ భూమి రిజిస్ట్రేషన్ ఆలస్యమైంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సర్పంచ్ భర్త పత్తి కృష్ణారెడ్డి, 2022లో రెవెన్యూ అధికారులతో కలిసి ఆ భూమిని తన పేరిట నమోదు చేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, గతంలో తీసుకున్న పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా, కేవలం 2.70 లక్షలు మాత్రమే ఇస్తానని, "దిక్కున్న చోట చెప్పుకోండంటూ" బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.

తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య...

ఈ బెదిరింపులు, అన్యాయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓదెలు గత నెల 2వ తేదీన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ 3వ తేదీన మృతి చెందారని రజిని కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.

పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు – ఆందోళన హెచ్చరిక...

బాధిత యాదవ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని, తక్షణమే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎస్ హెచ్ ఓ కు వినతిపత్రం అందజేశామని, కరీంనగర్ సీపీ, ఏసీపీలకు కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పత్తి కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి భూమి దక్కేలా చేయకపోతే స్థానిక నాయకత్వంతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌పీ మండల అధ్యక్షుడు తిరగమల్ల నాగార్జున, బొడ్డు దేవదాస్, బొడ్డు సుమన్, ఇమ్మడి ఉదయ్ కుమార్, తామన్ రామన్ కుమార్, మృతుని కుమారుడు కన్నెబోయిన కుమారస్వామి లు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని టీఆర్‌పీ డిమాండ్…

హుజూరాబాద్/ అక్టోబర్ 13 (మా అక్షరం):భూవివాదం కారణంగా మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన రైతు కన్నబోయిన ఓదెలు ఆత్మహత్యకు కారణమైన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రామ సర్పంచ్ పత్తి అనిత భర్త పత్తి కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన కన్నబోయిన ఓదెలు 2018లో పత్తి విష్ణువర్ధన్ రెడ్డి (పత్తి కృష్ణారెడ్డి సోదరుడు) నుంచి 1 ఎకరం 4 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా 10.40 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. అయితే కుటుంబ తగాదాలు, న్యాయపరమైన వివాదాల వల్ల ఆ భూమి రిజిస్ట్రేషన్ ఆలస్యమైంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సర్పంచ్ భర్త పత్తి కృష్ణారెడ్డి, 2022లో రెవెన్యూ అధికారులతో కలిసి ఆ భూమిని తన పేరిట నమోదు చేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, గతంలో తీసుకున్న పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా, కేవలం 2.70 లక్షలు మాత్రమే ఇస్తానని, “దిక్కున్న చోట చెప్పుకోండంటూ” బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.

తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య…

ఈ బెదిరింపులు, అన్యాయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓదెలు గత నెల 2వ తేదీన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ 3వ తేదీన మృతి చెందారని రజిని కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.

పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు – ఆందోళన హెచ్చరిక…

బాధిత యాదవ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని, తక్షణమే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎస్ హెచ్ ఓ కు వినతిపత్రం అందజేశామని, కరీంనగర్ సీపీ, ఏసీపీలకు కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పత్తి కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి భూమి దక్కేలా చేయకపోతే స్థానిక నాయకత్వంతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌పీ మండల అధ్యక్షుడు తిరగమల్ల నాగార్జున, బొడ్డు దేవదాస్, బొడ్డు సుమన్, ఇమ్మడి ఉదయ్ కుమార్, తామన్ రామన్ కుమార్, మృతుని కుమారుడు కన్నెబోయిన కుమారస్వామి లు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !