+91 99635 77856

జాతీయ రహదారిపై ధర్నాలు చేస్తే చర్యలు తప్పవు

Kudikala Sai Editor
maaksharamnews.in

జాతీయ రహదారిపై ధర్నాలు చేస్తే చర్యలు తప్పవు

-సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలి....

-ధర్నా నిర్వహించిన వారిపై కేసు నమోదు...

-ప్రజా రవాణాకు అంతరాయం కలిగించవద్దు.. ఏసీపీ వి. మాధవి హెచ్చరిక...

హుజురాబాద్/ అక్టోబర్ 13 (మా అక్షరం): ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని, జాతీయ రహదారులపై ధర్నాలు నిర్వహించి ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ

హుజురాబాద్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత పోలీస్ అధికారులు పరిశీలించి, చట్టప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని ఏసీపీ తెలిపారు. కేసుల్లోని వాస్తవాలు, సాక్ష్యాధారాలను పరిశీలించి దర్యాప్తు పూర్తి చేయడానికి కొంత సమయం అవసరమవుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు పోలీసులపై నమ్మకం ఉంచి దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

ధర్నా నిర్వహించిన వారిపై కేసు నమోదు

సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన బజ్జూరి తిరుమల (57) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 9న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ కేసులో సంబంధిత వ్యక్తిని విచారించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ఈ నెల 11న బజ్జూరి తిరుమలకు అన్యాయం జరిగిందంటూ చల్లూరి కోమల, మొలుగూరి లక్ష్మి మరికొందరు మహిళలతో కలిసి ఏసీపీ కార్యాలయానికి వచ్చారని వివరించారు. ఆ సమయంలో తాను కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో వారు సమీపంలోని జాతీయ రహదారిపై సుమారు 30 నిమిషాల పాటు ధర్నా నిర్వహించారని తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించి బజ్జూరి తిరుమల, చల్లూరి కోమల, మొలుగూరి లక్ష్మిపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అత్యవసర సేవలకు ఆటంకం కలిగించవద్దు

జాతీయ రహదారులపై నిత్యం అనేక మంది ప్రయాణిస్తుంటారని, వారిలో అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణించే వారు ఉంటారని ఏసీపీ గుర్తుచేశారు. రహదారులపై ధర్నాలు నిర్వహించడం వల్ల వారి ప్రయాణానికి ఆటంకం కలగడమే కాకుండా తీవ్ర అసౌకర్యం ఎదురవుతుందని తెలిపారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోవాలని, పోలీసులపై ఫిర్యాదులు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించవద్దని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

-సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలి….

-ధర్నా నిర్వహించిన వారిపై కేసు నమోదు…

-ప్రజా రవాణాకు అంతరాయం కలిగించవద్దు.. ఏసీపీ వి. మాధవి హెచ్చరిక…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !