-బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కిరణ్ కుమార్…
హుజురాబాద్ / అక్టోబర్ 12 (మా అక్షరం):బీసీల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కాసగోని కిరణ్ కుమార్ను బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా కాసగోని కిరణ్ కుమార్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం నాయకులు ముక్కెర రాజు (హైకోర్టు న్యాయవాది), నారోజు రత్నం చారి, మేడిచల్మి నర్సింహా, పులవేని పోచమల్లు యాదవ్లకు ధన్యవాదాలు తెలియజేశారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీలను సంఘటితం చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమిస్తానని, బీసీల హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని కిరణ్ కుమార్ తెలిపారు.













