+91 99635 77856

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

Kudikala Sai Editor
maaksharamnews.in

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

-మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి...

హుజురాబాద్/ అక్టోబర్ 12 (మా అక్షరం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా బతుకమ్మ ఆడే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని, పండుగ అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసే నీటి ప్రదేశాలను కూడా శుభ్రపరచాలని సూచించారు. మహిళలు సౌకర్యవంతంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా అవసరమైన చోట్ల వీధి దీపాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పండుగకు ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి, కౌన్సిలర్లు సునీత బాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, భాస్కర్, పుణ్య బాబు, ఏఈ నరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వినయ్, జవాన్లు రాజు, రమేష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి…

హుజురాబాద్/ అక్టోబర్ 12 (మా అక్షరం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా బతుకమ్మ ఆడే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని, పండుగ అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసే నీటి ప్రదేశాలను కూడా శుభ్రపరచాలని సూచించారు. మహిళలు సౌకర్యవంతంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా అవసరమైన చోట్ల వీధి దీపాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పండుగకు ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి, కౌన్సిలర్లు సునీత బాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, భాస్కర్, పుణ్య బాబు, ఏఈ నరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వినయ్, జవాన్లు రాజు, రమేష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !