–నా కుటుంబ సభ్యుల సహకారంతోనే గెలిచాను..
-2018 ఎన్నికల్లో నువ్వు ఓడిపోవాలని నీ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది అబద్దమా పొన్నం ప్రభాకర్ చెప్పాలి..
-హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
కరీంనగర్ జిల్లా /హుజురాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన నన్ను నా కుటుంబ సభ్యులైన భార్య బిడ్డ ప్రచారం చేశారని, వారితోపాటు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల సహకారంతోనే గెలిచానని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాదులోని బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని అన్నారు. నా భార్య బిడ్డలు నాకోసం నా గెలుపు కోసం ప్రచారం చేయడంలో తప్పేముందో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు.పొన్నం ప్రభాకర్ 2018లో కరీంనగర్ అసెంబ్లీ తరపున పోటీ చేసినప్పుడు తన భర్త ఓడిపోవాలని పొన్నం సతీమణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది అబద్దమా చెప్పాలన్నారు.ఒకరిని అనే ముందు తనెంటో తాను తెలుసుకోవాలని అన్నారు. ఒక వేలుచూపిస్తే వేళ్ళు తిరిగి చూపిస్తాయని మర్చిపోవద్దన్నారు.పొన్నం లా నక్కజిత్తులతో గెలవలేదని, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచాను అని అన్నారు. హుజురాబాద్ లో ఓటమి ఎరగని ఈటెల రాజేందర్ ను ఓడించి తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలు హుజురాబాద్ వైపు చూసేలా చేశానన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రవీణ్ రెడ్డి తన గెలుపు కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేసుకున్న తరువాత ప్రవీణ్ రెడ్డికి కేటాయించే సీటును పొంది పొన్నం నక్కలా వెళ్లి గెలిచాడని ఎదేవ చేశారు. దమ్ము ,ధైర్యమున్న నాయకునివైతే కరీంనగర్ లో పోటీ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. సొంత నియోజకవర్గంలో గెలవలేడనే భయంతోనే పక్క నియోజకవర్గానికి వెళ్లాడన్నారు. 2018లో కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు కేవలం 38 వేల ఓట్లు మాత్రమే పొన్నం ప్రభాకర్ కి వచ్చాయన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పాల్గొన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో కేవలం 19 ఓట్లు మాత్రమే పొన్నంకు వచ్చాయని, అదే హుజురాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు పార్లమెంట్ సమయంలో 50వేల పైచిలుకు ఓట్లు వేయించాను అని అన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున హుజురాబాద్ లో నేను పోటీ చేస్తే 62,000 ఓట్లు వచ్చాయని అన్నారు. తిరిగి బిఆర్ఎస్ లో చేరిన తర్వాత కెసిఆర్ ఆశీర్వాదంతో హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతో గెలిచిన చరిత్ర నాది అని అన్నారు. మంత్రి పొన్నం ఇతరులపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












