+91 99635 77856

ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే నిబద్దత కలిగిన సంఘం పి ఆర్ టీ యూ

Kudikala Sai Editor
maaksharamnews.in

ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే నిబద్దత కలిగిన సంఘం పి ఆర్ టీ యూ

-విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం..
-పి ఆర్ టీ యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ ....
హుజురాబాద్/మే 17(మాఅక్షరం): ఉపాధ్యాయుల,విద్యారంగ సమస్యలపై తమ సంఘం రాష్ట్ర స్థాయిలో అంకిత భావంతో నిరంతరం పోరాడుతోందని ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ లో పి ఆర్ టీ యూ రాష్ట్ర అధ్యక్షడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని సంఘ భవనంలో వెంకటేష్ ఆధ్వర్యంలో హనుమకొండ ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను తమ రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి హర్షవర్ధన్ రెడ్డి తమ సంఘం అధ్యక్షునిగా ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలపై పోరాడుతున్నారని, ఉపాధ్యాయులకు అండగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి ఆర్ సి, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, నాణ్యమైన విద్య భోధన, పదోతరగతి లో ఉత్తమ ఫలితాలు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు తదితర అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్ రెడ్డి తమకు అన్ని రంగాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు వెంకటేష్ వెల్లడించారు.

Share ePaper Clip

Preparing image...

-విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం..
-పి ఆర్ టీ యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ ….
హుజురాబాద్/మే 17(మాఅక్షరం): ఉపాధ్యాయుల,విద్యారంగ సమస్యలపై తమ సంఘం రాష్ట్ర స్థాయిలో అంకిత భావంతో నిరంతరం పోరాడుతోందని ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ లో పి ఆర్ టీ యూ రాష్ట్ర అధ్యక్షడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని సంఘ భవనంలో వెంకటేష్ ఆధ్వర్యంలో హనుమకొండ ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను తమ రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి హర్షవర్ధన్ రెడ్డి తమ సంఘం అధ్యక్షునిగా ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలపై పోరాడుతున్నారని, ఉపాధ్యాయులకు అండగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి ఆర్ సి, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, నాణ్యమైన విద్య భోధన, పదోతరగతి లో ఉత్తమ ఫలితాలు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు తదితర అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షడు హర్షవర్ధన్ రెడ్డి తమకు అన్ని రంగాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు వెంకటేష్ వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !