+91 99635 77856

మొక్కల పెంపకం చేపట్టండి

Kudikala Sai Editor
maaksharamnews.in

మొక్కల పెంపకం చేపట్టండి

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...
 -రాజపల్లిలో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన...

హుజురాబాద్/ మే24(మాఅక్షరం): పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కల పెంపకం చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని రాజపల్లి ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గదుల్లో చేపట్టిన పనులను పర్యవేక్షించారు.అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యుత్ సరఫరా, లైటింగ్, ఫ్యాన్ల ఏర్పాటుతో పాటు టాయిలెట్స్, ఇతర వసతుల సంబంధించిన పనులు చేపట్టామని వివరించారు.అదేవిధంగా సంప్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వాష్ రూముల్లో టైల్స్ వేయించాలని సూచించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. పాఠశాలలో ఖాళీ స్థలం బాగుందని, ఇందులో పండ్లు, పూల మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయకుమార్, ఎంపీడీవో సునీత తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…
 -రాజపల్లిలో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన…

హుజురాబాద్/ మే24(మాఅక్షరం): పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కల పెంపకం చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని రాజపల్లి ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గదుల్లో చేపట్టిన పనులను పర్యవేక్షించారు.అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యుత్ సరఫరా, లైటింగ్, ఫ్యాన్ల ఏర్పాటుతో పాటు టాయిలెట్స్, ఇతర వసతుల సంబంధించిన పనులు చేపట్టామని వివరించారు.అదేవిధంగా సంప్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వాష్ రూముల్లో టైల్స్ వేయించాలని సూచించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. పాఠశాలలో ఖాళీ స్థలం బాగుందని, ఇందులో పండ్లు, పూల మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయకుమార్, ఎంపీడీవో సునీత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !