–మండల వ్యవసాయ అధికారి చందుపట్ల సునీల్ కుమార్
హుజురాబాద్/మే 25(మా అక్షరం): రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ మండల వ్యవసాయ అధికారి చందుపట్ల సునీల్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ గ్రామ రైతులతో సమావేశమై రైతులు విత్తనాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. విత్తనాల కొనుగోలు చేసే ముందు కచ్చితంగా బిల్లులు తీసుకోనీ పంట కాలము పూర్తి అయ్యేవరకు అట్టి బిల్లులను భద్రపరచుకోవాలి అన్నారు. విత్తన బస్తలపై ఉన్న కనీసధర కన్నా ఎక్కువ పెట్టి కొనరాదనీ, ఎక్కడైనా తక్కువ ధరకు వస్తున్నాయని తీసుకుంటే పంట దిగుబడి సమయములో నకిలివని తేలితే చాలా నష్టపోతారని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విత్తనాల అమ్మువారినీ వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలియపరుస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరము వానాకాలంలో లోతుదుక్కులు చేసుకోవాలని వ్యవసాయ శాఖలో అమలుపరిచే సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమములో వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి జయెందర్, కారోబార్ రామస్వామి, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పుష్పలత మరియు రైతులు పాల్గొన్నారు.











