+91 99635 77856

మత్తుకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

Kudikala Sai Editor
maaksharamnews.in

మత్తుకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

హుజరాబాద్/ జూన్ 19(మా అక్షరం): యువత మత్తుకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి అన్నారు. బుధవారం సింగపూర్ కిడ్స్ కాలేజీలో కాలేజీ ఆంటీ డ్రగ్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ కు బానిసై ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని,తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలను గుర్తించి నడుచుకోవాలన్నారు. మత్తుకు బానిసైన యువత తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలోకి వెళ్తారని,చివరకు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థి దశలో ఏదైనా కేసులు అయితే జీవితంలో వారి ఉన్నతికి అవరోధంగా మారుతాయి అన్నారు. యువత తలచుకుంటే మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించవచ్చు అని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే భారతదేశం లోనే యువత ఎక్కువ ఉందని ఏది సాధించాలన్న యువత తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి యువకుడు మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ మత్తు పానీయాల నిషేధానికి తమ వంతు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐలు రమేష్ ,వెంకట్, రవి లతో పాటు కళాశాల యాజమాన్యం, కళాశాల యాంటీ డ్రగ్స్ కమిటీతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !