-భయాందోళనల్లో ప్రజలు
-హడలెత్తిస్తున్న ఊరకుక్కలు
-రాత్రుల్లో బయటకి వెళ్లాలంటే జంక్ తున్న ప్రజలు..
హుజురాబాద్ /జూలై 22(మా అక్షరం): కుక్కలు ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది విశ్వాసం గల జంతువు.. అది ఒకప్పటి మాట.. ఇప్పుడు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్న జంతువుగా మారింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుక్కలు చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ చంపి వేస్తున్న వైనం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు ఉంటూ వచ్చి పోయే వారిని బెదిరింపులకు గురిచేస్తున్నాయి కొన్ని సమయాల్లో కరవడం కూడా జరుగుతుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడిలో చాలామంది చిన్నారులతో పాటు చాలామంది కుక్క కాటు బారిన పడి మరణించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి నప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మూలన చేయలేక పోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుక్కల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో ఊర కుక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు దారివెంట వెళితే భయాందోళనకు గురిచేస్తూ కొన్ని సమయాల్లో వెంటపడుతున్నాయి.మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో నుంచి కుక్క కాటుకు గురైన వారు ఉన్నారు. ఏదైనా పని మీద రాత్రి బయటకి వెళ్లే వారు భయంతో జంకుతున్నారు. రాత్రి వేళలో ఎవరైనా ఆ కుక్కల ముందు నుంచి వెళ్తే వారిపై దాడికి దిగే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా టూ వీలర్ బైక్ మీద రాత్రి వెళ్లే వ్యక్తులపై కుక్కలు మొరుగుతూ వెంటపడుతున్నాయి. ఇటీవల కాలంలో మంథని లోని అన్ని ఏరియాలో ఊర కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి అంబేద్కర్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ ఇలా ఒక ప్రాంతం కాదు హుజరాబాద్ లోని అన్ని ఏరియాలో కుక్కల దాడి పెరిగిపోతున్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. వాహనదారులను, చిన్నపిల్లలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో హుజురాబాద్ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా ఉండేది ఇటీవల కోతులు కొంచంలో కొంచం తగ్గినప్పటికీ ప్రస్తుతం కుక్కలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కోతులు బెడద విపరీతంగా ఉన్నప్పుడు మున్సిపల్ అధికారులు స్పందించి కోతులు పట్టే వారిని తీసుకువచ్చి కోతులను పట్టించి ఇక్కడి నుంచి తీసుకువెళ్లి వేరే ప్రాంతంలో ఎలాగైతే తరలించారో అదేవిధంగా కుక్కలను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించి తమకు కుక్కల బారి నుంచి రక్షించాలని ప్రజల కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను పట్టాలని లేనియెడల భవిషత్తులో వాటితో ప్రజలకు ఆపద పొంచి ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హుజరాబాద్ లో కుక్కల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే వాటిని పట్టి వేరే ప్రాంతాలకు పంపిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.











