+91 99635 77856

6 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…

హుజూరాబాద్/ఆగస్టు16(మా అక్షరం): మండలంలోని కందుగుల గ్రామంలో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ తిరుమల్ తెలిపారు.కందుగుల గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో టీవీఎస్ షాంపూ పై గందె తిరుపతి అనే వ్యక్తి రెండు ప్లాస్టిక్ సంచులలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారన్నారు. వివరాల ప్రకారం… కందుగుల గ్రామానికి చెందిన గందే తిరుపతి వివిధ గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కందుగుల గ్రామానికి చెందిన మహాలక్ష్మి రైస్ మిల్లు కు అమ్మడం కోసం తీసుకు వెళుతున్న సమయంలో పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని ఆ వ్యక్తిని విచారించగా మహాలక్ష్మి రైస్ మిల్లు వద్దకు రేషన్ బియ్యాన్ని తీసుకు వెళ్తున్నానని తెలుపగా వారు రైస్ మిల్ వద్దకు వెళ్లి చూడగా అప్పటికే దాదాపు 5 క్వింటాళ్ల వరకు రేషన్ బియ్యం మిల్లులో ఉన్నాయన్నారు. ఆ రేషన్ బియ్యాన్ని మిల్లు యజమాని వక్కలుగా చేసి కోళ్ల ఫారం ఇతరులకు అధిక రేటుకు విక్రయిస్తాడని తెలిసిందన్నారు.ఆరు క్వింటాల రేషన్ బియ్యంతో పాటు టీవీఎస్ షాంపూ వాహనాన్ని కూడా సీజ్ చేసి ఆ వ్యక్తిపై రైస్ మిల్లు యజమాని ముషం వెంకటేష్ పై కేసు నమోదు చేశామని తెలిపారు.

.…ఎవరైనా రేషన్ బియ్యాన్ని అమ్మిన, కొనుగోలు చేసిన రవాణా చేసిన వాటిని వేరే విధంగా తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తిరుమల హెచ్చరించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !