+91 99635 77856

క్రీడలతో మానసిక ఉల్లాసం

Kudikala Sai Editor
maaksharamnews.in

క్రీడలతో మానసిక ఉల్లాసం

-క్రీడల వల్ల యువత చెడు మార్గంలో వెళ్లకుండా దోహదపడతాయి...
-హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్...
హుజురాబాద్/ఆగస్టు 29(మా అక్షరం): క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని,గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.
మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో గురువారం స్టంప్స్ బాక్స్ క్రికెట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు క్రీడాకారులతో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామీణ క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించి విద్యార్థులను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.యువత సైతం చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రీడల పట్ల ఆసక్తిని కనపరుస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ, టౌన్ సిఐ జి.తిరుమల్ తో పాటు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-క్రీడల వల్ల యువత చెడు మార్గంలో వెళ్లకుండా దోహదపడతాయి…
-హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్…
హుజురాబాద్/ఆగస్టు 29(మా అక్షరం): క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని,గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.
మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో గురువారం స్టంప్స్ బాక్స్ క్రికెట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు క్రీడాకారులతో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామీణ క్రీడలకు ప్రత్యేక నిధులు కేటాయించి విద్యార్థులను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.యువత సైతం చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రీడల పట్ల ఆసక్తిని కనపరుస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ, టౌన్ సిఐ జి.తిరుమల్ తో పాటు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !