+91 99635 77856

పెంచికల పేట వద్ద రోడ్డు ప్రమాదం

Kudikala Sai Editor
maaksharamnews.in

పెంచికల పేట వద్ద రోడ్డు ప్రమాదం

-స్పందించిన బీ ఆర్ ఎస్ యువనేత మొలుగు పూర్ణచందర్..
-ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు...
హుజురాబాద్/ఆగస్టు29(మా అక్షరం): పట్టణ శివారులోని ఎల్కతుర్తి మండలం పెంచికల పేట సమీపంలో ఉన్న అన్నదాత సీడ్స్ వద్ద వరంగల్ కరీంనగర్ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ వైపు నుండి హుజురాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్.. అదే రూట్ లో వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇదే సమయంలో డీసీఎం వెనుక వైపు నుండి తన కారులో వస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ యువ నేత మొలుగు పూర్ణచందర్ వెంటనే తన వాహనాన్ని నిలిపి.. క్షతగాత్రులను ఒక ప్రైవేటు అంబులెన్సు తెప్పించి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వెంటనే ఆసుపత్రి వైద్యులను సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని వైద్యులను సిబ్బందిని కోరారు.ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో వల్బాపూర్ తో పాటు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మానవత్వంతో స్పందించి అంబులెన్స్ కు ఫోన్ చేసి ప్రభుత్వ 108 అందుబాటులో లేకపోవడంతో వెంటనే ప్రైవేటు అంబులెన్స్ తెప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం కృషిచేసిన బి ఆర్ ఎస్ యువనేత మొలుగు పూర్ణచందర్ ను పలువురు అభినందిస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

-స్పందించిన బీ ఆర్ ఎస్ యువనేత మొలుగు పూర్ణచందర్..
-ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు…
హుజురాబాద్/ఆగస్టు29(మా అక్షరం): పట్టణ శివారులోని ఎల్కతుర్తి మండలం పెంచికల పేట సమీపంలో ఉన్న అన్నదాత సీడ్స్ వద్ద వరంగల్ కరీంనగర్ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ వైపు నుండి హుజురాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్.. అదే రూట్ లో వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇదే సమయంలో డీసీఎం వెనుక వైపు నుండి తన కారులో వస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ యువ నేత మొలుగు పూర్ణచందర్ వెంటనే తన వాహనాన్ని నిలిపి.. క్షతగాత్రులను ఒక ప్రైవేటు అంబులెన్సు తెప్పించి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వెంటనే ఆసుపత్రి వైద్యులను సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని వైద్యులను సిబ్బందిని కోరారు.ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో వల్బాపూర్ తో పాటు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మానవత్వంతో స్పందించి అంబులెన్స్ కు ఫోన్ చేసి ప్రభుత్వ 108 అందుబాటులో లేకపోవడంతో వెంటనే ప్రైవేటు అంబులెన్స్ తెప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం కృషిచేసిన బి ఆర్ ఎస్ యువనేత మొలుగు పూర్ణచందర్ ను పలువురు అభినందిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !