+91 99635 77856

నాగారం లో భక్తాంజనేయస్వామి దర్శించుకున్న ప్రణవ్..

– ఆలయంలోని అంజన్న విగ్రహానికి మకర తోరణం బహుకరణ…
– ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రణవ్…
– అంజన్న సేవలో ప్రణవ్…
– ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు…
– రహదారి నిర్మాణానికి కృషి చేయాలని కోరిన గ్రామస్తులు,సానుకూలంగా స్పందించిన ప్రణవ్…
హుజురాబాద్/అక్టోబర్07(మా అక్షరం): నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతుల పంటలు సమృద్ధిగా పండాలని అంజన్నను కోరుకున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం జమ్మికుంట మండల పరిధిలోని నాగారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారికి మకరతోరణాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చానని,తాను కూడా అంజన్న భక్తుడినేనని ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయానికి మరల రావడం సంతోషాన్ని కలిగించిందని,రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.నాగారం నుండి ఎల్లంపల్లి వెళ్లే మట్టిరోడ్డు పూర్తిగా పాడైందని ఈ దారి పూర్తయితే తమ ప్రాంతానికి రహదారి సమస్యలు తప్పినట్టుగా అవుతాయని,దీన్ని దృష్టిలో ఉంచుకొని రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించవలసిందిగా గ్రామ ప్రజలు కోరగా,సానుకూలంగా స్పందించిన ప్రణవ్ త్వరలోనే సంబంధిత మంత్రితో మాట్లాడి రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.గతంలో చెప్పినట్టుగా హుజురాబాద్ ప్రజల అభివృద్ధి భాధ్యత నాదని,ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రణవ్ కు ఆశీర్వచనం అందజేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !